డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు..600 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

-

డిగ్రీ చేసి ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంకు 600 పోస్టులను భర్తీ చెయ్యడానికి తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఐడీబీఐ బ్యాంక్ తన వద్ద ఉన్న 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది..ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులు. ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతీ తప్పు సమాధానికి ఒక్కో ప్రశ్నకు 0.25 (పావు మార్కు) నెగిటివ్ మార్కు ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.36 వేల నుంచి రూ. 63 వేల 840గా ఉంది. ఈ ఏడాది జనవరి 1 నాటికి అభ్యర్ధుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు మినహాయింపు ఉంటుంది.

అయితే అభ్యర్థులు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల్లో కనీసం రెండేళ్లు పని చేసిన అనుభవం తప్పనిసరి. పరీక్ష ఫీజు రూ. 1000. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారు రూ. 200 చెల్లిస్తే సరిపోతుంది..ఇక ముందుగా ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ పరిశీలన, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీరిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విషయానికి వస్తే రెండు గంటలు ఉంటుంది.

ఈ పరీక్షలో మొత్తం 200 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలకు 60 మార్కులు, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్, కంప్యూటర్, ఐటీకి సంబంధించి 60 ప్రశ్నలకు 60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలకు 40 మార్కులను కేటాయించారు..ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

https://www.idbibank.in.. మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version