హైడ్రాకు 78 ఫిర్యాదులు.. స్వయంగా స్వీకరించిన కమీషనర్ రంగనాథ్..!

-

ఈరోజు నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 78 ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ మొత్తం ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు కమీషనర్ రంగనాథ్. చెరువులు, నాళాల, ర‌హ‌దారులు, పార్కుల కబ్జాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదుల‌ను విచారించి.. సంబంధిత అధికారుల‌కు ఆయా ఫిర్యాదుల‌ను కేటాయించి విచార‌ణ చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశం ఇచ్చారు.

ఒకవేళ 4 వారాల్లో ఫిర్యాదు ప‌రిష్కారం కాకుంటే.. తానే స్వయంగా వ‌చ్చి విచారిస్తాన‌ని ఫిర్యాదుదారులకు చెప్పారు కమీషనర్. అమీన్‌ పూర్ మండ‌లం ఐలాపూర్ గ్రామం స‌ర్వే నంబ‌రు 119 నుంచి 220 వర‌కూ ఉన్న 408 ఎక‌రాల్లో అక్ర‌మ అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ఫిర్యాదు వచ్చింది. అలాగే అబ్దుల్లాపూర్‌ మండ‌లం కుంట్లూర్ చెరువులో 2 ఎక‌రాల స్థ‌లాన్ని క‌బ్జాచేశార‌ని.. వెంట‌నే ఆ భూమిని కాపాడాలంటూ.. ఇంకా నిజాంపేట మున్సిపాలిటీ లో 2900 గ‌జాల పార్కును స్థానికులు క‌బ్జా చేస్తున్నార‌ని కేవీఆర్ రెయిన్‌బో కాల‌నీ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version