చాలా మంది విలువైన డాక్యుమెంట్లని, బంగారాన్ని బ్యాంక్ లాకర్ లో దాచుకుంటూ వుంటారు. మీరు కూడా మీ బంగారాన్ని, విలువైన డాక్యుమెంట్లని బ్యాంక్ లాకర్ లో పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పకుండ ఈ విషయాలని తెలుసుకోవాలి. బ్యాంక్ లాకర్ ఉపయోగించుకోవాలని అనుకుంటే వాటి యొక్క చార్జీల గురించి చూడాలి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంక్, బ్యాంక్ బ్రాంచ్ ఉన్న ప్రాంతం బట్టీ లాకర్ చార్జీలు మారుతూ ఉంటాయి.
ముందుగా ఎస్బీఐ ఎంత తీసుకుంటుంది అనేది చూస్తే.. రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు ఉంటుంది. బ్యాంక్‌లో స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్‌లలో లాకర్లు లభిస్తున్నాయి. వీటికి రూ. 2 వేలు, రూ. 4 వేలు, రూ. 8 వేలు, రూ. 12 వేల చొప్పున చార్జీలు తీసుకుంటాయి. గ్రామీణ ప్రాంతం, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో రూ. 1500, రూ. 3 వేలు, రూ. 6 వేలు, రూ. 9 వేలుగా ఉన్నాయి.
అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే రూ.1250 నుంచి తీసుకుంటుంది. స్మాల్ సైజ్ లాకర్‌కు అయితే రూ.1250 కట్టాలి. మీడియా సైజ్ లాకర్ అయితే రూ.2500, లార్జ్ లాకర్‌కు రూ.3 వేలు, వెరీ లార్జ్‌కు రూ. 6 వేలు, ఎక్స్‌ట్రా లార్జ్‌కు రూ.10 వేల చార్జీలు చెల్లించాల్సి వుంది. పట్టణ, మెట్రో నగరాల్లో అయితే రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు కట్టాలి.
ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌లో చూస్తే..స్మాల్ సైజ్ లాకర్‌కు ఈ చార్జీలు రూ. 1200 నుంచి రూ. 5 వేల వరకు పే చెయ్యాల్సి వుంది. మీడియం సైజ్ లాకర్‌కు రూ. 2500 నుంచి రూ. 9 వేల దాకా పే చెయ్యాలి. లార్జ్ లాకర్‌కు రూ. 4 వేల నుంచి రూ. 15 వేల వరకు పే చెయ్యాలి. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్‌కు అయితే రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు కట్టాల్సి వుంది.