ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని 20 అంతస్తుల నివాసం భవవనంలోని 18వ అంతస్తులో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న కమల భవనంలో ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగాయని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 2 మరణించారని.. 15 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలు, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై మేయర్ కిషోరి ఫడ్నేకర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు. మంటలు అదుపులోకి వచ్చినా.. దట్టమైన పొగలు బిల్డింగ్ లో వ్యాపించాయని ఆమె వెల్లడించారు.