బ్యాంక్ ఖాతాదారుల‌కు అలర్ట్.. వరుస‌గా 4 రోజులు సెల‌వులు

-

అన్ని బ్యాంక్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్. రేప‌టి నుంచి వ‌రుస‌గా 4 రోజుల పాటు అన్ని బ్యాంక్ లకు సెల‌వులు ఉండ‌నున్నాయి. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి బ్యాంక్ ప‌ని దినాల‌లో నే బ్యాంక్ ప‌నులు ముగించు కోవాలి. కాగ‌ ఈ మ‌ధ్య కాలం లో బ్యాంక్ ఖాతాదారుల సంఖ్య గణ‌నీయం గా పెరిగింది. ప్ర‌తి రోజు ల‌క్షలాది క‌స్ట‌మ‌ర్లు బ్యాంక్ ల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారికే ఈ వార్త‌. నేటి నుంచి అంటే డిసెంబ‌ర్ 16 నుంచి డిసెంబ‌ర్ 19 వ‌ర‌కు అన్ని బ్యాంక్ ల‌కు సెల‌వులు ఉన్నాయి.

అయితే డిసెంబ‌ర్ 16, 17 తేదీ ల‌లో బ్యాంక్ ఉద్యోగులు స‌మ్మె చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం బ్యాంక్ ల‌ను ప్ర‌యివేటు ప‌రం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తు బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు స‌మ్మె చేస్తున్నారు. అలాగే డిసెంబ‌ర్ 18న యు సోసో థామ్ వ‌ర్థంతి. దీంతో ఈ రోజు దేశ వ్యాప్తం గా బ్యాంక్ ల‌కు సెల‌వులు ఉండ‌వు. కానీ షిల్లాంగ్ లో సెల‌వు ఉంటుంది. డిసెంబ‌ర్ 19 న ఆది వారం కావ‌డం తో బ్యాంక్ లకు సెలవు ఉంటుంది. కాగ మ‌న తెలుగు రాష్ట్రాల‌లో శ‌నివారం మిన‌హా మిగిత మూడు రోజుల పాటు సెల‌వులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news