ఈ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్… మారిన వడ్డీ రేట్లు…!

-

మీకు ఈ బ్యాంక్ లో ఖాతా వుందా..? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ మార్చింది. అయితే మరి ఈ విషయాలని అకౌంట్ కలిగిన వాళ్ళు తెలుసుకోవడం మంచిది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 10 నుంచే అమల్లోకి రావడం జరిగింది.

వడ్డీ రేట్లు ఇక ఎలా వున్నాయి అనేది చూస్తే.. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కనీస వడ్డీ రేటు 2.75 శాతంగా ఉంది. గరిష్ట వడ్డీ రేటు 5.15 శాతంగా ఉంది. ఇది ఇలా ఉంటే 7 రోజుల నుంచి 14 రోజులకి అయితే 2.75 శాతం వుంది. అదే 15 రోజుల నుంచి 30 రోజులకు అయితే 2.90 శాతం, 31 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి గల డిపాజిట్లకు 2.90 శాతం, 46 రోజుల నుంచి 90 రోజులకి 3.25 శాతం, 91 రోజుల నుంచి 179 రోజులకి 3.80 శాతం వడ్డీరేటును సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందిస్తోంది.

ఇక యూకో బ్యాంకు విషయానికి వస్తే.. యూకో బ్యాంకు కనీస వడ్డీ రేటు 2.80 శాతం, గరిష్ట వడ్డీ రేటు 5.60 శాతంగా ఉంది. 7 రోజుల నుంచి 29 రోజులకు 2.80 శాతం, 30 రోజుల నుంచి 45 రోజులకు 3.05 శాతం, 46 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి గల డిపాజిట్లకు 3.80 శాతం, 91 రోజుల నుంచి 180 రోజుల వ్యవధి గల డిపాజిట్లకు 3.95 శాతం వుంది.

181 రోజుల నుంచి 364 రోజులకైతే 4.65 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఏడాదికైతే 5.35 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్లకు 5.60 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్లకు 5.60 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు 5.80 శాతం, ఐదేళ్లకు పైబడిన డిపాజిట్లకు 5.60 శాతం వడ్డీ రేటును యూకో బ్యాంకు ఇస్తోంది. కనుక కస్టమర్స్ వీటిని గమనిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news