తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ప్రతిపక్షాలపై తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి… కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ పై ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ విమర్శల బాణాలను సంధిస్తారు.
ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.
అయితే ఈ ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ విషయాలపై మాట్లాడుతూ అందరూ చర్చించుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్ర విభజనపై చాలా దుర్మార్గంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. ఇవాళ సీఎం కేసీఆర్ దీనిపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా నిన్న యాదాద్రిలో మొన్న జనగామ జిల్లా లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ బహిరంగ సభలో కూడా భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు.