ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..నేటి నుంచే ఈ రూల్స్ అమలు..

-

ప్రతి నెల ఒకటో తారీఖూ వచ్చింది అంటే అన్ని రంగాల్లో కొత్త రూల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే..ఈ మేరకు నేటి నుంచి బ్యాంక్ రూల్స్ కొన్ని మారాయని తెలుస్తుంది. బ్యాంకుల్లో చెక్స్ క్లియరెన్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే..రూ.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన చెక్స్‌ని ఎన్‌క్యాష్ చేయడానికి పాజిటీవ్ పే సిస్టమ్ పాటించడం తప్పనిసరి. ఈ రూల్స్ పాటించకపోతే అటువంటి చెక్కుల క్లియరెన్స్‌ను తిరస్కరించడానికి బ్యాంకులకు అనుమతి ఉంది..

కాగా, చెక్ క్లియరెన్స్‌కు పాజిటీవ్ పే సిస్టమ్ నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ రూల్స్ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకులు కస్టమర్లకు ఈ విషయంపై అవగాహన కల్పించాయి. కస్టమర్లు పాజిటీవ్ పే సిస్టమ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని కోరుతున్నాయి…

ఆర్బీఐ అందిస్తున్న సమాచారం ప్రకారం,పెద్ద మొత్తం విలువతో ఉన్న చెక్కులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను తిరిగి నిర్ధారించుకోవడానికి పాజిటీవ్ పే సిస్టమ్ ఉపయోగపడుతుంది. చెక్కును జారీ చేసినవారు ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పూర్తి వివరాలు వెల్లడించాలి..ఆ చెక్ పైన ఉన్న తేదీ, బెనిఫీషియరీ పేరు, చెల్లించాల్సిన మొత్తం లాంటి వివరాలను డ్రా చేసుకునే బ్యాంకుకు వివరించాలి. అధిక-విలువ చెక్కును జారీ చేసే వ్యక్తి జారీ చేసిన తేదీతో సహా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇమెయిల్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలి..

ఆ తర్వాత చెక్ ను బ్యాంక్ లో ఇచ్చినప్పుడు ఆ వివరాలు సరిపోతే సదరు వ్యక్తికి డబ్బులు ఇస్తారు. లేకపోతే చెక్కు చెల్లించకుండా తిరిగి వెనక్కి పంపిస్తారు.ఆర్‌బీఐ పాజిటీవ్ పే సిస్టమ్‌ను 2021 జనవరి 1న అమలు చేసింది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు ఈ విధానం పాటించాలని సూచించింది. అయితే ఇది తప్పనిసరిగా లేదు. ఆగస్ట్ 1 నుంచి రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు తప్పనిసరిగా పాజిటీవ్ పే సిస్టమ్ పాటించాల్సిందే. ఈమేరకు పలు బ్యాంకులు 2022 ఆగస్ట్ 1 నుంచి రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు పీపీఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశాయి.
మీరు ఎవరికైనా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్ ఇస్తే ఇమెయిల్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ వివరాలను బ్యాంకుకు కూడా తెలపాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ పైన ఉన్న తేదీ, అమౌంట్, ట్రాన్సాక్షన్ కోడ్, బెనిఫీషియరీ పేరు, ఎంఐసీఆర్ కోడ్ లాంటి వివరాలను ముందుగానే తెలపాలి.. ఇవే కాదు వీటితో పాటు అన్ని రంగాల్లో కూడా నేటి నుంచి రూల్స్ మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news