భార్యతో జూ.ఎన్టీఆర్ కాఫీ డేట్.. ఫొటో వైరల్

-

టాలీవుడ్ హీరోల్లో ఫ్యామిలీ మ్యాన్ అనగానే గుర్తొచ్చే వారిలో ముందుండేది మహేశ్ బాబు, ఎన్టీఆర్. ముఖ్యంగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీని, ఫ్యామిలీ లైఫ్ ను లైమ్ లైట్ కు దూరంగా ఉంచుతారు. కానీ అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని ఖుష్ చేయడానికి సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో గడిపిన మూమెంట్స్ ని పోస్ట్ చేస్తుంటారు. అలా ఈరోజు జూ.ఎన్టీఆర్ పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూసేయండి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ఏళ్లుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీ అయ్యారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. NTR 30, NTR 31 సినిమాలను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలను పట్టాలెక్కించడానికి ముందుగానే తన ఫ్యామిలీని తీసుకొని ట్రిప్ కి చెక్కేశారు ఎన్టీఆర్. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు తన ట్రిప్ లో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తన భార్య ప్రణతితో కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతున్నట్లుగా ఉంది ఈ ఫొటో. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ అందరూ ఈ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news