పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్… తగ్గిన వడ్డీ రేట్లు..!

-

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఎకౌంట్ వుందా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ సేవింగ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లని తగ్గిస్తున్నాయి . అదే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ కూడా సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చేసాయి. పీఎన్‌బీ రూ. 100 కోట్ల వరకు చేసే సేవింగ్స్‌ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని అందించేది. కానీ సెప్టెంబర్ 1 నుంచి 0.10 శాతం తగ్గించి 2.9 శాతం వడ్డీ ఇవ్వనుంది. అదే రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసిన సేవింగ్స్ డిపాజిట్లపై సైతం 2.9 శాతం వడ్డీని మాత్రమే ఇస్తున్నట్టు తెలిపింది.

7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూర్ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 2.9% – 5.25% మధ్య వడ్డీని ఇవ్వగా.. సీనియర్ సిటిజన్లు మాత్రం తమ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లు 3.4% – 5.75% మధ్య వడ్డీని పొందొచ్చు. ఆగస్టు ఒకటి నుండి ఈ రూల్స్ అమలులోకి రావడం జరిగింది. ఇక డెబిట్ కార్డ్స్ గురించి చూస్తే.. ప్లాటినం డెబిట్ కార్డుదారులు రోజుకు రూ. 50,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. క్లాసిక్ డెబిట్ కార్డుదారులు రోజుకు రూ.25,000 వరకు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news