బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే నానబెట్టిన బాదం( Soaked almonds )తో రోజు మొదలుపెడితే అదిరిపోయే ప్రయోజనాలు పొందవచ్చు. నిజంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానం, తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తాయి. నానబెట్టిన బాదం తో రోజుని మొదలు పెడితే కలిగే లాభాలు ఇవే..
పోషక పదార్థాలు అందుతాయి:
బాదంలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ తో పాటు ప్రోటీన్స్, విటమిన్స్, మెగ్నీషియం ఇందులో ఉంటాయి.
జీర్ణ సమస్యలు ఉండవు:
ఉదయాన్నే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణం సరిగ్గా అయ్యేటట్టు ఇది చూసుకుంటుంది.
చర్మానికి, జుట్టుకి మంచిది:
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అలానే చర్మం ఎంతో స్మూత్ గా ఉండేటట్టు చూస్తుంది.
మెదడు ఆరోగ్యం:
మెదడు ఆరోగ్యానికి కూడా బాదం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే నానబెట్టిన బాదంతో రోజుని మొదలు పెడితే మైండ్ ఎంతో రిలాక్స్ గా, ప్రశాంతంగా ఉంటుంది. అలానే బాదంలో విటమిన్ ఇ ఉండడంవల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ కి మంచిది:
బాదం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అదే విధంగా ఉదయాన్నే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
హృదయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎనర్జీని పెంచుతుంది:
బాదం లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. అలానే బాడీ మెటబాలిజం కూడా పెరుగుతుంది.
గర్భిణీలకు మేలు:
బాదంలో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. అలానే ఇది నాచురల్ లేబర్ కి కూడా ఇది ఉపయోగపడుతుంది.