మార్చి నెల ముగింపు దశకు వచ్చేసింది. ఇక ఏప్రిల్ నెల ప్రారంభానికి సమయం సమీపించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో బ్యాంకు లావాదేవీలు చేయాలనుకుంటున్న వారికి అలర్ట్. వచ్చే నెలలో బ్యాంకులు (Bank Holidays) దాదాపు సగం రోజులు పనిచేయవు. శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
- ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో సెలవు
- ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
- ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే
- రెండు, నాలుగో శనివారాలు
- నాలుగు ఆదివారాలు
ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని (AP Bank Holidays) బ్యాంకులకు జగ్జీవన్‌రామ్ జయంతి రోజు మాత్రం సెలవు లేదు. రెండు, నాలుగో శనివారాలు, నాలుగు ఆదివారాలు బ్యాంకులు పని చేయవన్న విషయం తెలిసిందే. ఇలా ఏప్రిల్ నెలలో తెలంగాణలో 11, ఏపీలో 10 రోజులు బ్యాంకులకు సెలవులు.