రుణగ్రహీతలకి గుడ్ న్యూస్… తక్కువ వడ్డీకే లోన్..!

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది లోన్ తీసుకునే వారికీ ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా సులభంగా తక్కువ వడ్డీ రేటుతో లోన్స్ ని ఇస్తోంది.

 

బ్యాంక్ దీని కోసం ఎంఎస్ఎంఈ ఉత్సవ్ స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. అయితే ఈ స్కీమ్ లో భాగంగా చౌక వడ్డీకే లోన్ ని తీసుకొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ స్కీమ్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన వారు రూ.50 కోట్ల వరకు లోన్స్ ని పొందవచ్చు అని బ్యాంక్ అంది.

వ్యాపారులు తక్కువ వడ్డీ రేటు తో లోన్స్ దీని ద్వారా పొందచ్చు. ఈ విషయం బ్యాంక్ ట్విట్టర్ వేదికగా చెప్పింది. రూ.250 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు రూ.50 కోట్ల వరకు లోన్ పొందవచ్చు.

అలానే 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రిబేట్ బెనిఫిట్ కూడా. 6.55 శాతం నుంచి వడ్డీ స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, ల్యాండ్ కొనుగోలు, ఫ్యాక్టరీల కొనుగోలు వంటి వాటికి ఇది ఉపయోగ పడుతుంది. ముడి పదార్ధాలు, ల్యాబ్ ఎక్విప్‌మెంట్, మెషినరీ కొనుగోలు వంటి వాటి కోసం కూడా ఈ లోన్ హెల్ప్ అవుతుంది.