NBK107 : బాలయ్య కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్.. వేట మొదలైంది !

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ,  లెజెండ్ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే నమ్మకంతో ఇప్పుడు ముచ్చటగా అఖండ అనే సినిమా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతుంది.  ఇక ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు లిటిల్ పిక్స్ కాన ప్పటికీ.. హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది.

బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 13వ తారీఖున ఉదయం 10.26 గంటలకు ఈ సినిమాను ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు నవీన్ ఏర్నేటి, వై రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఇక ఈ అప్ డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news