గుడ్​న్యూస్.. ఈపీఎఫ్‌ వడ్డీ 8.15 శాతానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

ఉద్యోగులకు కేంద్ర సర్కార్ తీపి కబురు అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్​ (EPFO) వడ్డీ రేటు 8.15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేటు 8.15 శాతం పెంచుతూ సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది. దీంతో ఆరు కోట్ల ఈపీఎఫ్​ఓ సబ్​స్క్రైబర్లకు లాభం చేకూరనుందని తెలిపింది.

ఈపీఎఫ్​ఓ 2023 మార్చి 28వ తేదీన ఈపీఎఫ్​ వడ్డీ రేట్లు మార్జినల్​గా పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ఆమోదం తెలుపుతూ.. భాగంగా ఇవాళ అన్ని ఉద్యోగ కార్యాలయాలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన 8.15 శాతం వడ్డీ రేటును కలిపి ఉద్యోగుల భవిష్య నిధికి డబ్బులు జమ చేయాలని స్పష్టం చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రి 2023 మార్చిలో ఈపీఎఫ్​ఓ ట్రస్టీలతో సమావేశం అయ్యి, వడ్డీ రేట్లు పెంపు గురించి చర్చించారు. అందులో భాగంగా మార్జినల్​గా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఆదేశాలతో ఈపీఎఫ్​ఓ ఫీల్డ్ ఆఫీసర్లు.. ఈ పెంచిన వడ్డీ రేట్లను ఖాతాదారుల అకౌంట్​ల్లో క్రెడిట్ చేసే పనిని ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version