RBI: డెబిట్​, క్రెడిట్ కార్డు పేమెంట్ లో మార్పులు..!

-

తాజాగా రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మర్చంట్ సైట్లకు టోకెనైజేషన్​ను కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​ల్లో క్రెడిట్​, డెబిట్ కార్డుల వివరాలు ఇక సేవ్ అవ్వవు. కార్జులు జారీ చేసే వారు లేదా కార్డు నెట్​వర్క్​లకు​ మినహాయింపు ఉంటుంది.

RBI
RBI

ఇది 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంది. ఇక కస్టమర్స్ పై ఎలాంటి ప్రభావం పసుతుంది అనేది చూస్తే.. ఇప్పుడు అయితే అన్ని మర్చంట్ ప్లాట్​ఫామ్​లు కార్డు వివరాలు సేవ్ చేసుకుంటున్నాయి. షాపింగ్ చేసే సమయంలో ప్రతీసారి క్రెడిట్​ కార్డు/ డెబిట్ కార్డు వివరాలు పూర్తిగా టైప్ చెయ్యక్కర్లేదు. ఓటీపీతోనే పని పూర్తి అవుతుంది.

ఒకవేళ కనుక ఈ టోకెనైజేషన్ రద్దయితే ట్రాన్సాక్షన్ చేయాల్సిన ప్రతీ సారి కూడా కస్టమర్లు తమ 16 అంకెల కార్డు నంబర్​, కార్డు ఎక్స్​పైరీ, సీవీ టైప్ చేయాల్సి ఉంటుంది. దీనితో ఆన్​లైన్ షాపింగ్ మరింత సెక్యూర్ గా ఉంటుంది. కార్డు వివరాలు సేవ్ కాకుండా.. వన్​క్లిక్ పర్చేజెస్ ఫీచర్ లేకపోతే కస్టమర్లు కార్డు పేమెంట్స్​పై ఆసక్తి కోల్పోతారేమోనని మర్చంట్లు కాస్త ఆందోళన చేస్తున్నప్పటికీ కస్టమర్లు వివరాలు సేఫ్​గా ఉండేలా అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఆర్​బీఐ మాత్రం టోకెనైజేషన్ కట్టడికే నిర్ణయం తీసుకుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news