పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లు

-

పెద్దనోట్ల రద్దు ప్రకటించడంతో బ్యాంకుల్లో డిపాజిట్ల జాతర పెరిగింది. క్యాష్‌ డిపాజిట్లు వరదలా వచ్చి పడుతున్నాయి. ఆన్‌లైన్‌ మోడ్‌లో, ఆఫ్‌లైన్‌ మోడ్‌లో ఎలా వీలయితే అలా డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో, బ్యాంక్‌ డిపాజిట్లు ప్రస్తుతం 6 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి బ్యాంకుల్లో ఉన్న మొత్తం డిపాజిట్ల విలువ 191.6 లక్షల కోట్ల రూపాయలు.

2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో డిపాజిట్లలో ఒక్కసారిగా ఊపు పెరిగింది. పింక్‌ నోట్ల ప్రవాహంతో స్ట్రాంగ్‌ రూమ్స్‌ నిండిపోతున్నాయి.
ఈ ఏడాది మే 19న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రూ. 2000 నోట్లను చెలామణి నుంచి విత్‌డ్రా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత, సిస్టమ్ నుంచి రూ. 2000 నోట్లు బ్యాంకులకు తిరిగి రావడం ప్రారంభమైంది. ఈ నెల ప్రారంభంలో రిజర్వ్‌ బ్యాంక్‌ రిలీజ్‌ చేసిన డేటా ప్రకారం, విత్‌ డ్రా నిర్ణయం తీసుకునే నాటికి ఉన్న మొత్తం రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లలో, ఇప్పటి వరకు మూడో వంతుకు పైగా పింక్‌ నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయి. వీటిలో దాదాపు 85 శాతం నోట్లను ప్రజలు తమ అకౌంట్లలో డిపాజిట్‌ చేశారు, దాదాపు 15 నోట్లను చిన్న నోట్లుగా మార్చుకున్నారు.

బ్యాంక్‌ డిపాజిట్లు ఏటా 13% చొప్పున పెరుగుతూ వస్తున్నాయి, ఇప్పటికి 191.6 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ మొత్తం, గత 6 సంవత్సరాల్లోనే అత్యధిక స్థాయి. 2017 మార్చి తర్వాత ఇదే హైయెస్ట్‌ వాల్యూ. గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేట్ల పెంపు కారణంగా, బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్లు కూడా పెరిగాయి. 2023 జూన్‌ 30 నాటికి, స్వల్పకాలిక వడ్డీ రేటు సగటున 5.94%గా ఉంది. గత ఏడాది జులై 31న ఈ సగటు రేటు 4.3%గా నమోదైంది. షార్ట్‌ టర్మ్‌ డిపాజిట్‌ రేట్లు పెరగడం డిపాజిట్ల పెరుగుదలకు కారణం. అయితే, ఈ ఏడాది మే 4 ఈ సగటు 6.69% ఉంది.

బ్యాంక్‌ రుణాల్లోనూ జంప్‌

క్రెడిట్-డిపాజిట్ వృద్ధి మధ్య అంతరం 2022 నవంబర్‌లోని 875 బేసిస్ పాయింట్ల నుంచి 2023 జూన్‌లో 326 బేసిస్ పాయింట్లకు మెరుగుపడింది. ఇది ఆల్ టైమ్ హై. పర్సనల్‌ లోన్లు, NBFCలు, వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చిన లోన్ల మొత్తం రూ. 143.9 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలం కంటే ఇది 16.2% ఎక్కువ. క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ పెరగడం వల్ల కూడా బ్యాంక్‌ లోన్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి బ్యాంక్‌ క్రెడిట్‌ గ్రోత్‌ 13-13.5%గా ఉండొచ్చని అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version