డబ్బును ఇలా ఇన్వస్ట్‌ చేస్తే 15 ఏళ్లలో కోటీశ్వరలు అవ్వొచ్చు తెలుసా..?

-

ధనం మూలం ఇదం జగత్‌ అంటారు. ఇది వందశాతం నిజం. ఒక మనిషిని పైకి లేపాలన్నా, పాతాళానికి తొక్కాలన్నా పచ్చనోటుకే సాధ్యం. ఈ డబ్బు ఎన్నో మార్గాల ద్వారా సంపాదించవచ్చు. కానీ ఎలా సంపాదిస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజులో 9 గంటలు కష్టపడి పనిచేస్తే కానీ 500 వస్తాయి. అదే ఇంకో వ్యక్తికి గంట చేస్తే చాలు ఆ డబ్బు వచ్చేస్తుంది. ఇక్కడ విలువ డబ్బుదా, మనిషి చేసిన పనిదా..? వచ్చిన మార్గానిది..? మీరు తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే. రిస్క్‌ లేకుండా ఒక ఫార్ములాను ఫాలో అవ్వండి..! అదేంటంటే..

అయితే మీరు 15 ఏళ్లలోనే కోటీశ్వరులు అవ్వాలని భావిస్తే మాత్రం.. ఈ ఫార్ములాను ఫాలో అవ్వాల్సిందే. ఇంతకీ అది ఏ రూల్ అని అనుకుంటున్నారా? 15*15*15 రూల్ ఒకటి ఉంది. దీని ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. ఎలా అంటే.. మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించాలి. నెలకు రూ. 15 వేలు ఇన్వెస్ట్ చేయాలి. అలాగే 15 శాతం రాబడి పొందాలి. మీరు ఈ రూల్ ఫాలో అయితే కోటీశ్వరులు అయిపోవచ్చు.

కాంపౌండింగ్ బెనిఫిట్ ద్వారా మీరు అదిరే రాబడి పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం కన్నా భారీ లాభాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే కాంపౌండింగ్ బెనిఫిట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీపై కూడా వడ్డీ వస్తూనే ఉంటుంది. చక్రవడ్డీ మ్యాజిక్‌ అదే కదా! అందుకే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ ద్వారా భారీ మొత్తం పొందొచ్చు. అందుకే ఈ 15*15*15 ఫార్ములా ద్వారా ఎలాంటి రాబడి సొంతం చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం.

మీరు రూ. 15 వేలు చొప్పున ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారు. మీ టెన్యూర్ 15 ఏళ్లు. ఇక్కడ రాబడి కూడా 15 శాతం వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు 15 ఏళ్ల తర్వాత ఏకంగా రూ. కోటి లభిస్తాయి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 27 లక్షలు. అయితే వడ్డీ రూపంలో వచ్చేది రూ. 73 లక్షలు. అంటే ఏ స్థాయిలో రాబడి లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో ఈ మేరకు రాబడి అందించే అవకాశం ఉందని మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ నిపుణులు అంటున్నారు. మీరు నెలకు రూ. 10 వేల చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. టెన్యూర్ 20 ఏళ్లు అని అనుకుంటే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో వడ్డీ రూపంలో రూ. 75 లక్షల వరకు రావొచ్చు. ఇక్కడ రాబడి 12 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 24 లక్షలు అవుతుంది. అంటే మీకు మొత్తంగా దాదాపు రూ. 99 లక్షలు వచ్చినట్లు అవుతుంది.

నెలకు పదివేలు అంటే కాస్త పెద్ద అమౌంటే అనుకోండి. మీరు ఉన్న పరిస్థితికి చేయగలగితే ఇలా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌..సంవత్సరానికి లక్షా ఇరవై వేలు మీవి కావు అనుకోని సేవ్‌ చేసే కాపాసిటీ ఉంటే ఆలోచించుకోని స్టెప్‌ తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news