బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా..? అయితే వీటిని ఫాలో అవ్వండి..!

-

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బులని బ్యాంకుల్లో పెట్టి మంచిగా రాబడి పొందాలని అనుకుంటారు. మీరు కూడా బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలని అనుకుంటున్నారా…? ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక ఇవి తెలుసుకోవాలి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇటీవల కీలక వడ్డీ రేట్లను మార్చలేదు. దీంతో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదు. కానీ వీటిని కనుక ఫాలో అయితే మంచిగా రాబడి వస్తుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూసేద్దాం.

 

money

ఎప్పుడైనా కూడా షార్ట్ టర్మ్ డిపాజిట్లను సెలెక్ట్ చెయ్యాలి. తక్కువ కాల పరిమితితో బ్యాంక్ లో డబ్బులు దాచుకోవాలి. ఎందుకంటే ఆర్‌బీఐ తర్వాతి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లు పెంచితే లాభదాయకంగా ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఎఫ్‌డీ చేసి, మెచ్యూరిటీ గడువు దగ్గరిలో ఉంటే అప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఒకే టెన్యూర్‌లో కాకుండా వివిధ కాల పరిమితుల్లో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి.

ఇది ప్రాఫిట్ గా ఉంటుంది. అలానే బ్యాంకులు ఇప్పుడు ఫ్లోటింగ్ రేటు ఎఫ్‌డీలను అందిస్తున్నాయి. దీని వలన కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. మరొక ట్రిక్ ఏమిటంటే ఎఫ్‌డీలను కూడా ఒకే రకమైన బ్యాంకుల్లో కాకుండా వివిధ బ్యాంకుల్లో తెరవాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో, బ్యాంకుల్లో ఇలా చేస్తే కూడా మంచిగా డబ్బులు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version