Firecracker Insurance : 9 రూపాయలకే దీపావళి ఇన్సూరెన్స్ అందిస్తున్న ఫోన్ పే .. వివరాలు

-

దీపావళి పండగ వచ్చేస్తోంది. ఆల్రెడీ వ్యాపారులు తమ దుకాణాలను కొత్త కొత్త రంగులతో తళుక్కుమనిపించడానికి రెడీ అవుతున్నారు. అయితే దీపావళి రోజున టపాసులు ఖచ్చితంగా కాల్చాల్సిందే.

కొందరు టపాసులు పేల్చడానికి భయపడుతుంటారు. వారి భయానికి తగినట్లు టపాసుల వల్ల గాయాలు కూడా అవుతుంటాయి. ప్రస్తుతం ఈ గాయాలకు ఇన్సూరెన్స్ వచ్చేసింది.

అవును, దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చినపుడు గాయాలైతే 25వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అందిస్తోంది ఫోన్ పే. అది కూడా కేవలం 9రూపాయల ప్రీమియమ్ కి మాత్రమే.

వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ ఇన్సూరెన్స్ పదిరోజుల కాలానికి వర్తిస్తుంది. అంటే ఒకసారి తీసుకుంటే పదిరోజుల పాటు మాత్రమే వర్తిస్తుంది. అక్టోబర్ 25నుండి ఇన్సూరెన్స్ కాలం మొదలవుతుంది.

ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి?

దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఫోన్ పే యాప్ లోకి వెళ్ళి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేసి, మీకూ మీ కుటుంబసభ్యులకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కొలాబరేషన్ తో కలిపి ఫోన్ పే ఈ ఇన్సూరెన్స్ ని తీసుకొచ్చింది.

అయితే ఇన్సూరెన్సుల్లో ఇలాంటి షార్ట్ టర్మ్ స్కీమ్స్ చాలా ఉంటాయి. ఫోన్ పే తీసుకొచ్చింది కొత్తదేం కాదు. కాకపోతే కేవలం ప్రత్యేకంగా దీపావళికి తీసుకురావడమే కొత్త. జనరల్ గా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ప్రమాదాలకు వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news