స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్…వీటిలో మార్పు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా లాభాలు పొందొచ్చు. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఓ గుడ్ న్యూస్ ని తీసుకు రావడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… శనివారం నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం జరిగింది.

అదే విధంగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి, రెండేళ్ల కంటే తక్కువ కాలం గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంది. ప్రస్తుతం అయితే ఎస్‌బీఐ ఏడాది లేదా అంత కంటే ఎక్కువ వ్యవధి, రెండేళ్ల కంటే తక్కువ వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5 శాతం వడ్డీని చెల్లిస్తుంది.

కానీ ఇక నుండి ఈ డిపాజిట్లకు బ్యాంకు 5.1 శాతం వడ్డీ ఇవ్వనుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ వడ్డీ రెట్లని స్టేట్ బ్యాంక్ అమలు లోకి తీసుకు వచ్చింది. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ, రెండేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీల వడ్డీ రేట్లు 5.50 శాతం నుంచి 5.60 శాతానికి పెరిగాయి. ఇది ఇలా ఉంటే మిగిలిన ఎఫ్‌డీల వడ్డీ రేట్లలో మాత్రం మార్పు లేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version