ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో… కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా… అందరికీ కరోనా సోకుతుంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, సెలబ్రీటీలు ఇలా అందరికీ ఈ కరోనా మహమ్మారి సోకింది. ఇక తాజాగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా సోకడం ఇది మూడో సారి. నిన్న సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు… ప్రజలతో కలిసి డాన్సులు చేశారు. అయితే… అది గడిచి ఒక్క రోజు గడువక ముందే.. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ప్రకంటించారు. తనతో నిన్నటి వరకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు అంబటి రాంబాబు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రకటన చేశారు.