బిచ్చగాళ్ల బ్యాంక్ గురించి విన్నారా..? అక్కడ 1 శాతం వడ్డీకే రుణాలట..!

-

సాధారణంగా బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంక్స్ మనకి గుర్తు వస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా బెగ్గర్ బ్యాంక్ గురించి విన్నారా..? అవునండి మీరు చదివింది కరెక్ట్. బెగ్గర్ బ్యాంక్ కూడా వుంది. బిచ్చగాళ్ల బ్యాంక్ ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

బిచ్చగాళ్ల బ్యాంక్ కూడా ఒకటుంది. అది కూడా ఎక్కడో కాదు అంది. మన దేశంలోనే. ఇక ఆ బ్యాంక్ గురించి చూస్తే.. బీహార్‌ లోని ముజఫర్‌పూర్‌ లో ఈ బ్యాంక్ ఉంది. అయితే ఈ బ్యాంక్ ని కొంత మంది బిచ్చగాళ్లు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారే దీన్ని నడిపించుకుంటున్నారు. నిజంగా ఆశ్చర్యంగా వుంది కదా. కానీ ఇది నిజమే. 175 మంది బిచ్చగాళ్లు స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి, ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

దీనికి అక్కడి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సహాయం అందిస్తోంది. ఇక్కడ కూడా డిపాజిట్లు, విత్‌డ్రాయెల్స్, రుణాలు వంటివి కూడా ఉంటాయి. గ్రూపుల కోఆర్డినేషన్, నిర్వహణ వంటి పనులు చూసుకుంటుంది. ఇది ఇలా ఉంటే వీరిలో 70 శాతం మంది మహిళలు. యాచన తర్వాత వచ్చిన డబ్బులను ఈ బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటారు.

ఇలా డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది. బ్యాంక్ సభ్యులు ఈ డబ్బులను 1 శాతం వడ్డీ రేటుతో రుణానికి తీసుకోవచ్చు. ఆ డబ్బుని మళ్ళీ మూడు నెలలకు కట్టాలి. ఇలా ఈ బ్యాంక్ నడుస్తోంది. కానీ కరోనా వలన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version