MAA Elecrtions 2021:మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మంచు విష్ణు – ప్రకాశ్‌రాజ్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మా పోరు మరింత వేడెక్కుతున్నాయి. మంగళవారం.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా, అనంతరం విష్ణు ప్రెస్‌మీట్ పెట్టి ఆ ఆరోపణలను ఖండిస్తూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. లోకల్, నాన్ లోకల్ అనే సమస్య తెర మీదికి వచ్చింది. ‘మా’ అధ్యక్షుడిగా బయటివాళ్లను ఎందుకు ఎన్నుకోవాలి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా… నటుడు, దర్శకుడు రవిబాబు ‘మా’ ఎన్నికలపై పెదవి విప్పారు. రవిబాబు ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను లోకల్, నాన్‌లోకల్ అంశాన్ని అసలు ప్రస్తవించడం లేదనీ, మన మూవీ ఆర్టిస్టుల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ చిన్న అసోసియేషన్ ను మన నడుపుకోలేమా? అధ్యక్ష పదవికి బయటవాళ్లను ఎందుకు ఎన్నుకోవాలంటూ ప్రశ్నించారు. అసోసియేషన్ నడపడం మనకు చేత కాదా? ఎవరో వచ్చి నేర్పాలా? అంటూ ధ్వజమెత్తారు.
అంతేగాక.. మన క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశాలివ్వకుండా.. ఇతర భాషల నుంచి నటులను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే.. హైదరాబాద్‌లో 150 నుంచి 200 మంది కెమెరామెన్లు అవకాశాలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు, కెమెరా మెన్‌లే కాదు.. మేకప్‌మేన్‌లు, ఇతర టెక్నిషియన్‌లు అవకాశాలు కోల్పోయారని, మూవీ మేకర్స్ కూడా మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారని బాధపడ్డారు.
అదంతా డబ్బులు పెట్టే నిర్మాతల ఇష్టమని, కానీ.. మన నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం.. మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’. ఈ చిన్న సంస్థను కూడా నడపడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? మనకు చేతకాదా..? ఎవరో వచ్చి మనకు నేర్పించాలా..? ఒక్కసారి ఆలోచించండి’ అంటూ రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.