ఈ బ్యాంక్స్ లో తక్కువ వడ్డీకే గృహ రుణాలు పొందొచ్చు..!

-

సొంతింటి కలని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సొంతింటి కలను సాకారం చేసుకునే ఆర్థిక స్థోమత చాలా మందికి ఉండదు. ఇలాంటి వారు గృహ రుణాలను తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. తక్కువ వడ్డీకే గృహ రుణాలని అందించే బ్యాంక్ వివరాలను ఇప్పుడు చూద్దాం. గృహ రుణ వడ్డీ రేట్లు 6.5% నుంచి ప్రారంభమవుతున్నాయి. కాగా కొన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు చవకైన వడ్డీ రేట్లకే హోం లోన్స్ ఇస్తున్నాయి. ఇక వాటి కోసం చూసేస్తే..

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న రుణగ్రహీతలకు రుణ మొత్తంతో సంబంధం లేకుండా 6.7 శాతం వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తోంది. కనుక ఎస్బీఐ నుండి హోమ్ లోన్ ని పొందొచ్చు.

అలానే కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా కూడా తక్కువ వడ్డీకే రుణాలని ఇస్తోంది. ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ గత సంవత్సరం నవంబర్ నుంచి అతి తక్కువ వడ్డీ రేట్లపై గృహ రుణాలు అందిస్తోంది. పంజాబ్ & సింద్ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే లోన్ ఇస్తోంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు గృహ రుణాలపై 6.65 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అదే విధంగా టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ కంపెనీ 20 ఏళ్ల కాలపరిమితితో రూ.75 లక్షల గృహ రుణానికి 6.7 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. రుణ గ్రహీతలు రూ.56,805 ఈఎంఐ చెల్లించాలి.ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.8 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news