ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం

-

ద్రవ్యోల్బణం కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఆరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి కీలక వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెపోరేటును 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతా దాస్ తెలిపారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

“2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7శాతంగా అంచనా వేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటును 7.3 శాతంగా అంచనా వేశాం దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలు వృథా కాకుండా చూడనున్నాం. రిటైల్‌ ద్రవ్యోల్బణం లక్ష్యిత పరిధి 4 శాతానికి తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మార్పులేదు. 2024లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశాం. దేశ ఆర్థిక కార్యకలాపాల్లోని జోరు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది. “అని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతా దాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news