రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడానికి ఆఫ్‌లైన్ పేమెంట్లకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దీని కోసం కొన్ని రూల్స్ ని కూడా తీసుకొచ్చింది. ఇక వాటి కోసం చూస్తే..
ఆఫ్ లైన్ పేమెంట్స్ కి లిమిట్ ఉంటుంది. అలానే ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.200 వరకు చెల్లింపులు చెయ్యచ్చు. ఓవరాల్ లిమిట్ మాత్రం రూ.2 వేలుగా వుంది. అదే విధంగా ట్రాన్సక్షన్స్ నిర్వహించడానికి ఇంటర్నెట్ లేదంటే టెలికం కనెక్టివిటీ అవసరం ఉంటుంది. కార్డు, వాలెట్, మొబైల్ డివైజ్ వంటి వాటి ద్వారా ట్రాన్సక్షన్స్ చెయ్యచ్చు.
అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ ట్రాన్సక్షన్స్ కి అవసరం ఉండదు. ఆఫ్‌లైన్ మోడ్‌లో ట్రాన్సాక్షన్లు చేసినా సరే కస్టమర్లకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ వంటివి వస్తాయి. కొంత టైమ్ తర్వాత అలర్ట్ పొందొచ్చు. 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ వరకు ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించి ఫీడ్ బ్యాక్ కి తీసుకున్నారు. వాటిని పరిశీలించి రూల్స్ ని రూపొందించారు.
ఆఫ్‌లైన్ ట్రాన్సాక్సన్ల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్లు పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. ఇంకా ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లకు కూడా ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ వర్తిస్తుంది. కనుక ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు చేయొచ్చు.
అలాగే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్లు లాంటి కొత్త నిబంధనలు అనుసరించాలని ఆదేశించింది. కస్టమర్ అనుమతి తీసుకున్న తర్వాతనే పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్‌లైన్ సర్వీసులు అందించాలి.