ఈరోజుల్లో ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడం కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి. ఇందుకోసం అనవసర ఖర్చులను తగ్గించి సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇది పెద్ద కష్టమేమీ కాదు మితంగా ఖర్చు చేయడం అనేది కేవలం ఖర్చులను తగ్గించుకోవడమే కాదు స్మార్ట్ గా ఖర్చు పెట్టడం, అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టడం. మరి మితంగా, స్మార్ట్ గా ఖర్చు చేయడానికి ఉపయోగకరమైన కొన్ని టిప్స్ ని చూద్దాం..
స్మార్ట్ గా ఖర్చు చేయడానికి టిప్స్ : ప్రతి వ్యక్తి వారి ఆదాయం ఖర్చులను ట్రాక్ చేయడానికి ఒక పేపర్ పైన బ్లూ ప్రింట్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. మనం ఎంత సంపాదించాం అందులో నుంచి ఎంత ఖర్చు పెడుతున్నాం అని ప్రతి నెల ఖర్చులను ఆదాయాన్ని ఒక పేపర్ లో వ్రాసుకోవాలి.
ముఖ్యంగా నెలకి అవసరమైన ఖర్చులను ఉదాహరణకు ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా సరుకులు మొదలైనవి అవసరమైన ఖర్చుల కింద రాసుకోవాలి. ఇక అనవసర ఖర్చులు ఇందులో ముఖ్యంగా బయట తిరగడం, సినిమాలు, ఫాస్ట్ ఫుడ్ మొదలైనవి ఈ రకం ఖర్చుల కింద భావించి విభజించాలి. మీకు వచ్చిన ఆదాయంలో 50% అవసరాలకు 30% కోరికలకు 20% పొదుపు చేయడానికి ఉపయోగించడం ముఖ్యం. ఇలా పేపర్ మీద రాయడం కుదరదు అనుకుంటే దానికి తగినట్లుగా ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ లోనే బడ్జెట్ యాప్ లు, ఖర్చులను ట్రాక్ చేయడానికి ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
అవసరాలు కోరికలు రెండిటినీ వేరు చేయడం : ముఖ్యంగా మనిషి అవసరానికి తగినంత ఖర్చు చేయడం కన్నా తన కోరికల కోసం ఎక్కువ ఖర్చు చేయడం వలన కుటుంబంలో ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మీరు ఏవి నిజంగా అవసరమో అవి మాత్రమే ఒక భాగంగా ఖర్చు చేయాలి. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్ కి వెళ్తే ఒక వస్తువుని కొనుగోలు చేస్తుంటే ఇది నాకు నిజంగా అవసరమా అని మీకు మీరు ప్రశ్నించుకుంటే, చాలా వరకే అనవసర కొనుగోలను తగ్గించుకోవచ్చు. ఏదైనా ఒక ఖరీదైన వస్తువు కొనాలి అనుకునే ముందు, కొంత టైం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా షాపింగ్ కి వెళ్లేటప్పుడు ఇంట్లోనే ముందుగా ఇవి కొనాలి అని ఒక పేపర్ పై రాసుకొని వెళ్ళండి అవి మాత్రమే కొనుక్కొని రావడానికి ప్రయత్నించండి.
పొదుపు చేయడం: మనిషి సంపాదించిన దాంట్లో కనీసం 20% నెలకి పొదుపు చేయడం నేర్చుకుంటే రేపొద్దున భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా గడిచిపోతుంది. పొదుపు అనేది మితంగా ఖర్చు చేయడంలో ఒక కీలకమైన అంశం ముందుగానే పొదుపు చేయడం ద్వారా ఖర్చు చేయడానికి అందుబాటులో ఉన్న డబ్బు తగ్గిపోతుంది. మీ ఆదాయంలో ఒక భాగాన్ని ఆటోమేటిక్ గా సేవింగ్స్ అకౌంట్ కి బదిలీ చేసేలాగా మార్చుకోవడం ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసి పొదుపు చేయడం. అధిక వడ్డీతో ఉన్న రుణాలను తీసుకోకుండా ఉండాలి. ఇది మీ ఆర్థిక స్వేచ్ఛను తగ్గిస్తుంది. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో అధిక వడ్డీతో ఉన్న రుణాన్ని చేస్తే ముందుగా దాన్ని చెల్లించడానికి ప్రయత్నించండి. కొత్త రుణాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి.
గమనిక:పైన టిప్స్ ని పాటించడం కేవలం మీ వ్యక్తిగత అభిప్రాయం.