వచ్చే నెల 1 నుంచి ఈ స్కీమ్స్ బంద్…!

-

అక్టోబర్ 1, 2022 నుంచి ఈ స్కీమ్స్ లో మార్పులు రానున్నాయి. కనుక వీటిని కచ్చితంగా గమనించాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు తీసుకొచ్చిన సీనియర్ సిటిజన్ స్కీమ్స్ ఇక వుండవు. ఈ నెల చివరి వరకే ఈ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. తరవాత నుండి ఈ స్కీమ్స్ ఉండేవి బ్యాంకులు చెబుతున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 6.50 శాతం మేర వడ్డీ రేటును ఈ స్కీమ్ కింద ఇస్తోంది. ఐదు నుంచి పదేళ్లు వచ్చేసి ఈ స్కీమ్ మెచ్యూరటీ కాల వ్యవధి. 0.50 శాతం ప్రీమియానికి, అదనంగా మరో 0.25 శాతం ప్రీమియాన్ని ఇస్తోంది. కానీ ఇది 18 మే, 2020 నుంచి సెప్టెంబర్ 30, 2022 మధ్యలో బుక్ చేసుకున్న వాళ్లకి మాత్రమే అని బ్యాంక్ చెబుతోంది.

ఇది ఇలా ఉంటే ఐడీబీఐ బ్యాంకు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ 30 సెప్టెంబర్ 2022తో ముగుస్తుంది. నమాన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ స్కీమ్ ని ఐడీబీఐ బ్యాంకు తీసుకు వచ్చింది. మెచ్యూరిటీ కాల వ్యవధి ఏడాది నుంచి పదేళ్ల మధ్య లో ఉంది. ఈ స్కీమ్‌ లో చేరిన వారికి అదనంగా 0.75 శాతం వడ్డీని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version