దువ్వాడ వాణికి షాక్.. మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన శ్రీనివాస్

-

ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఇల్లు దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు సమాచారం. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసి ఇచ్చాడని.. రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్టు సమాచారం.

ప్రస్తుతం దివ్వెల మాధురి ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. వాణి తన కుమార్తెతో కలిసి ఆ ఇంటి వద్ద గత కొద్ది రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లొచ్చని టెక్కలి కోర్టు అనుమతిచ్చింది. తమకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని వాణి కుటుంబం బైఠాయించింది. దీంతో ఈ వివాదం మళ్లీ రచ్చకెక్కింది. మరోవైపు మాధురి మాత్రం ఆ వివాదస్పద ప్రాపర్టీ నాదే అని.. తన వద్ద రూ.2కోట్లు దువ్వాడ శ్రీనివాస్ తీసుకున్నాడని..  డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితి లేక నాకు బిల్డింగ్ తిరిగి ఇచ్చేశాడు. తనపై రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్టు వెల్లడించింది. తన ఇంటికి పవర్ కట్ చేయించారని.. సీసీ టీవీ పుటేజ్ కూడా పని చేయకుండా చేశారని మాధురి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version