విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొన్న ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ ఘటన పై విచారణ నిర్వహించాలని నీటి పారుదల శాఖ ఈఈ కృష్ణారావు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బోట్ల యజమానులను విచారించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేట్లను బోట్లు ఢీ కొన్న ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేసారు.
ఇటీవలే కృష్ణా నదికి ఎగువ నుంచి భారీ వరద రావడంతో నాలుగు ఇనుప బోట్లు కొట్టుకు వచ్చాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్ తగలడంతో అవి దెబ్బతిన్నాయి. 64వ నెంబర్ గేట్ వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బ తినగా.. 69వ గేట్ వద్ద ఉండేది పూర్తి మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటికి వచ్చాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి దెబ్బతిన్న గేట్లకు మరమ్మత్తులు చేపట్టారు. గేట్ల వద్ధ ఉన్నటువంటి బోట్లను తొలగించేందుకు భారీ క్రెయిన్లను ఉపయోగిస్తున్నారు. బోట్ల ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల.