పాస్వర్డ్ విషయంలో చాలా మంది చేసే తప్పులివే: స్టేట్ బ్యాంక్

-

స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. మీ బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ విషయంలో జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. వీక్ పాస్‌వర్డ్స్‌తో మీ బ్యాంకు ఖాతాలకు ముప్పు తీసుకొస్తుందని అంది బ్యాంక్. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్ లేదా, బ్యాంకింగ్ యాప్స్ సేఫ్ గా ఉంటాయి. కనుక ఈ విషయాలని గమనిస్తే మంచిది. లేదు అంటే మీరే నష్టపోవాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్వర్డ్ లో అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్ కలిపి ఉండాలి. అంటే ఆల్ఫాబెట్స్ మరియు నెంబర్స్ కలిసి ఉండాలి.

పాస్‌వర్డ్‌లో @_+= లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే అది మారురెంత దృడంగా ఉంటుంది. అలానే పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్లు ఉండాలి. 12 క్యారెక్టర్ల వరకు పాస్‌వర్డ్ పెట్టినా మంచిది. అదే విధంగా కొందరు చాలా కామన్ గా వుండే itislocked, thisismypassword, nopassword అనే సింపుల్ పాస్‌వర్డ్స్ పెడతారు. కానీ అలా చెయ్యద్దు.

qwerty, asdfg లాంటి పాస్‌వర్డ్స్ అస్సలు పెట్టకండి. 12345678, abcdefg లాంటి ఈజీ పాస్‌వర్డ్స్ పెడితే రిస్క్ తప్పదు. అలానే పేరును, పుట్టిన తేదీ లేదా సంవత్సరాన్ని కూడా పెట్టకండి. అయితే మీరు వీటిని పెట్టేటప్పుడు సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు సులువుగా గుర్తించలేనివి అయ్యి ఉండేలా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news