మీకు ICICI బ్యాంక్ లో అకౌంట్ వుందా..? అయితే మీరు తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి. లేదు అంటే మీరే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చార్జీలు నిన్నటి నుండే అమలు లోకి వచ్చాయి. క్రెడిట్ కార్డ్ ఆలస్య చెల్లింపు రుసుములు, నగదు ముందస్తు లావాదేవీల రుసుములు, చెక్ రిటర్న్ ఫీజులు , ఆటో డెబిట్ రిటర్న్ ఫీజులను పెంచాలని ICICI బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
మీ మొత్తం బకాయి బ్యాలెన్స్ రూ. 100 కంటే తక్కువగా ఉంటే ఎలాంటి చార్జెస్ మీరు చెల్లించక్కర్లేదు. అదే ఒకవేళ కనుక రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తానికి రూ. 1200 వసూలు చేస్తుంది అని బ్యాంక్ అంది. ఇక చార్జెస్ ఎలా పడుతున్నాయి అనేది చూస్తే.. రూ.100 – రూ.500 మధ్య చెల్లించాల్సిన మొత్తానికి రూ.100 విధించబడుతుంది.
అదే రూ.501 – రూ.5000 చెల్లించాల్సిన మొత్తానికి రూ.500 పడుతుంది. అదే ఒకవేళ 10,000 వరకు ఉంటే 750 చెల్లించాలి. రూ.25000 వరకు రూ.900 , రూ.50,000 వరకు రూ.1000 , రూ.50,000 వరకు రూ.1200. క్రెడిట్ కార్డ్ నుండి రూ. 20 వేల వరకు నగదు విత్డ్రా చేస్తే రూ.500 ఛార్జీ పడుతుంది. అలానే చెక్ రిటర్న్, ఆటో డెబిట్ రిటర్న్స్ కి కనీసం రూ. 500 జరిమానా పడుతుంది. కనుక కస్టమర్స్ వీటిని తెలుసుకుని నడుచుకుంటే మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాలి.