ఈనెల 31న ఆదివారమైనా బ్యాంకులన్నీ పనిచేయాలి.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

-

ప్రభుత్వ, వ్యాపార లావాదేవీలను నిర్వహించే శాఖలను మార్చి 31వ తేదీన తెరిచి ఉంచాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి రోజు, ఆదివారం కావటం వల్ల ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ స్వీకరణలు, చెల్లింపులను నిర్వహించే బ్యాంకు శాఖలను లావాదేవీల నిమిత్తం మార్చి 31వ తేదీన తెరిచి ఉంచాల్సిందిగా భారత ప్రభుత్వం కోరిందని ఆర్బీఐ వెల్లడించింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరం లోపు లెక్కించాలని తన శాఖలకు సూచించింది.

అన్ని ఏజెన్సీ బ్యాంకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. తద్వారా రసీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలు FY24లో నిర్వహిస్తారని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ను ఆర్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ టీఎస్‌ నాయర్‌ విడుదల చేశారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా, ఆదాయపు పన్ను శాఖ తన అన్ని కార్యాలయాలకు సుదీర్ఘ వారాంతపు సెలవులను కూడా రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news