గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి బ్యాంకులు… వివరాలు ఇవే…!

-

సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే మీకు శుభవార్త..! దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ ఇప్పుడు తక్కువ వడ్డీ రేటు తో రుణాలు ఇస్తోంది. గృహ రుణాలపై వడ్డీ రేటును ఐసిఐసిఐ బ్యాంక్ 6.70 శాతానికి తగ్గించింది. ఈ రేట్లు మార్చి ఐదు అంటే నిన్నటి నుండే అములు లోకి వచ్చాయి. అయితే రూ. 75 లక్షల వరకు గృహ రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఒకేవేళ రూ .75 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే వడ్డీ రేట్లు 6.75 శాతం తో ప్రారంభమై అక్కడి నుంచి పెరుగుతాయని వెల్లడించింది. ఈ రేట్లు మార్చి 31, 2021 వరకు అమలులో వుంటాయని ఐసీఐసీఐ చెప్పింది. ఐసీఐసీఐ హౌజింగ్ లోన్లపై వడ్డీ రేటు ఇలా ఉంటే ఇక మిగిలిన బ్యాంకులలో వడ్డీ రేట్లు ఇప్పుడు చూద్దాం. 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.75 శాతానికి హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) తగ్గించింది. అలానే దేశంలో అతిపెద్ద రుణదాత గృహ రుణ వడ్డీ రేట్లు సంవత్సరానికి 6.70 శాతం తక్కువగా ఉన్నాయి.

గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మార్చి 31, 2021 వరకు మాఫీ చేశారు. ఇది ఇలా ఉంటే కోటక్ బ్యాంక్ తన గృహ రుణ రేట్లను పరిమిత కాలానికి పది బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలానే ఇక నుండి పరిశ్రమ లో అతి తక్కువ రేట్లు కలిగి ఉంటాయని కోటక్ హామీ ఇచ్చింది. రేటు తగ్గింపు తరువాత, వినియోగదారులు మార్చి 31 వరకు 6.65 శాతానికి గృహ రుణాలు పొందగలరని చెప్పింది. 6.65% రేటు అన్ని రకాల గృహ రుణాలకు చెల్లుతుందని చెప్పడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version