తమ టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం టీవీ ఛానెళ్లు ఎంతకయినా తెగిస్తాయని మొన్న మరోసారి నిరూపితమైన సంగతి తెలిసిందే. ఇండియన్ లీడింగ్ టీవీ న్యూస్ ఛానల్స్ అని చెప్పుకున్నే కొన్ని ఛానల్స్ నడిపిన రేటింగ్ స్కామ్ ని ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. నకిలీ టీఆర్పీ రేటింగ్ ల బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
రోజూ తమ ఛానెల్ ని చూడాలని కోరుతూ బార్క్ బాక్స్ లు అమర్చిన ఒక్కో ఇంటికి 500 రూపాయలు ఇచ్చినట్లు ముంబై పోలీసులు తేల్చారు. మూడు టీవీ ఛానెళ్లు ఈ తరహా మోసానికి పాల్పడినట్లు వారం క్రితం ముంబై పోలీసులు బట్ట బయలు చేశారు. ఈ నేపధ్యంలో ఈ రేటింగ్స్ ఇచ్చే బార్క్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు తాము వారం వారం ఇచ్చే రేటింగ్స్ ఇవ్వబోమని, ఈ మూడు నెలల కాలంలో ఈ రేటింగ్స్ ని ఎవరూ టాంపర్ చేయలేని విధంగా ఎలా తీయవచ్చనే దాని మీద స్టడీ చేస్తామని బార్క్ ప్రకటించింది.