బ్రేకింగ్: తెలంగాణాలో బార్లు క్లబ్బులు ఓపెన్… !

-

తెలంగాణాలో బార్లు క్లబ్బులు ఓపెన్ చేయడానికి తెలంగాణా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్లబ్బులకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ మొదలైన నాటి నుంచి కూడా బార్లు, క్లబ్బులకు అనుమతి ఇవ్వలేదు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం పలు నిబంధనలను విధించింది. ఆ తర్వాత క్రమంగా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ వచ్చారు.

ఇప్పటికే రాష్ట్రంలో మద్యం షాపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సామాజిక దూర నిబంధలతో పాటుగా భౌతిక దూరంతో నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం బార్లకు అనుమతులు ఇచ్చింది. అన్ లాక్ 4 లో క్రమంగా అన్నీ కూడా ఓపెన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news