ఆవు పేడతో స్నానం చేస్తే కరోనా రాదా…?

-

కొందరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని వింతలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ఆవుల విషయంలో మాత్రం కొందరు చేస్తున్న ప్రచారం షాకింగ్ గా ఉంటుంది. ఆవు ఆక్సీజన్ పీల్చుకుని ఆక్సీజన్ వదిలేస్తుంది అని, కాబట్టి ఆవుని కాపాడినా ఒక చెట్టుని కాపాడినా ఒకటే అని, ఇక ఆవు మూత్రం ద్వారా వెయ్యి రకాల రోగాలు శాశ్వతంగా నయం అవుతాయని ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు.

తాజాగా కరోనా విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే ఒకటి ఆశ్చర్యకరంగా చేసారు జనాలు. ఆవు పేడతో స్నానం చేస్తే కరోనా రాదని అంటున్నారు. దేశంలో కరోనా వలన జనం భయపడి చస్తుంటే ఎవడి ప్రచారం వాడు ఎవడికి తోచిన విధంగా వాడు చేస్తూ జనాల్లో పాపులర్ అవుతున్నారు. తాజాగా ఆవు పేడ విషయంలో ఇదే విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆవు పేడ ఆరోగ్యానికి చాలా మంచిదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ, నెలకు ఓసారి చొప్పున, ఆరు నెలల పాటూ, ఆవు పేడతో స్నానం చేస్తే, సర్వ రోగాలూ నయం అవుతాయని చెప్పడం విశేషం. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌కి విరుగుడు కావాలీ అంటే, ఆవు పేడతో స్నానం చెయ్యాలని సూచిస్తున్నారు కొందరు. కాగా కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. కరోనా లాబ్స్ కూడా పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version