బ‌ట్ల‌ర్ మ‌రో హాఫ్ సెంచ‌రీ.. ముంబై టార్గెట్ 159

-

ఐపీఎల్ 2022 సీజ‌న్లో భాగంగా ఈరోజు ప‌టిష్ట‌మైన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను ముంబై ఇండియ‌న్స్ ఢీకొట్ట‌నుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే నేడు ఐపీఎల్‌-2022లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ అద్భుతం‍గా రాణిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింట్లోనూ ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని ముంబై పట్టుదలతో ఉంది.

అయితే టాస్‌ ఓడి బరిలోకి దిగిన రాజ‌స్థాన్ 6 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది మోస్తారు లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. ఆఖ‌రి ఓవ‌ర్లో ముంబై పేస‌ర్ మెరిడిత్‌ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి అశ్విన్ (21) వికెట్ ప‌డ‌గొట్టాడు. రాజ‌స్థాన్ ఇన్నింగ్స్‌లో బ‌ట్ల‌ర్‌, అశ్విన్ మిన‌హాయించి ఎవ్వ‌రూ రాణించలేదు. ముంబై బౌల‌ర్ల‌లో మెరిడిత్, హృతిక్ షోకీన్ త‌లో 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా డేనియ‌ల్ సామ్స్‌, కుమార్ కార్తికేయ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version