కెసిఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతాడో చూస్తా: కే ఏ పాల్

-

వచ్చె ఎన్నికల్లో కేసీఆర్ సీఎం ఎలా అవుతాడో చూస్తాను అంటూ కే ఏ పాల్ హెచ్చరించారు. హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజీలో మే 6న సభ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఏప్రిల్ 22న అప్లై చేశానని కానీ తనకు అనుమతి ఇవ్వకుండా రాహుల్ గాంధీ సభ కు ఎలా అనుమతి ఇస్తారు అంటూ కే ఏ పాల్ మండిపడ్డారు.ఇందులో కేసీఆర్ కుట్ర దాగి ఉందని శనివారం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద మీడియాతో మాట్లాడుతూ హనుమకొండ లో తాను సభ ఏర్పాటు చేసి రైతుల పక్షాన ఉద్యమం చేస్తానని భయపడి తనకు అనుమతి ఇవ్వకుండా రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇచ్చారన్నారు.

వచ్చే ఎన్నికల్లో నేను ఏమిటో చూపిస్తానని..కెసిఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతాడో చూస్తా అంటూ కే ఏ పాల్ అన్నారు.బంగారు తెలంగాణ కాదు..వెండి తెలంగాణ కూడా కాలే..అప్పుల తెలంగాణ అయిందన్నారు.గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని అన్నారు.రాహుల్ సభ అనుమతి రద్దు చేసి తనకు అనుమతి ఇవ్వాలన్నారు.లేకపోతే కోర్ట్ కి వెళ్తానని హెచ్చరించారు కె ఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version