రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేయలేదని… గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతుల పరిస్థితులను గమనించే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారని.. అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు.