రేపు దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన జరుగనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది బతుకమ్మ పండుగ. రేపు సాయంత్రం 9.40 నిమిషాలకు , 10.40 నిమిషాలకు ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా పై బతుకమ్మ వీడియో ప్రదర్శన జరుగనుంది. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం ఇదే మొదటి సారి.
ఒకే సారి దేశ విదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మ ను వీక్షించనున్నారు. రేపు సాయంత్రం భారత కాలమానం ప్రకారం… 9.40 PM కు , 10.40 PM కు రెండు సార్లు బూర్జ్ ఖలీఫా మీద బుతకమ్మ వీడియో ప్రదిర్శింప బడుతుంది. ఇక రేపు సాయంత్రం దుబాయ్ లో జరుగ బోయే ఈ కార్యక్రమంలో తెలంగాణ కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. అటు యూఏఈ ప్రభుత్వం ప్రతి నిధులు మరియు పారిశ్రామిక వేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.