రాష్ట్రంలో రేపటి నుంచే సమగ్ర కుటుంబ సర్వే

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే (కులగణన) రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది, టీచర్లు సర్వే చేపట్టనున్నారు. కుటుంబ యాజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను అందులో నమోదు చేయనున్నారు.

ఈనెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లను పూర్తి చేసింది. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్ ప్రాతిపదికన ముందుకు వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కులగణన వివరాలను వినియోగిస్తారని తెలుస్తోంది. కాగా, గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సమగ్ర కుటుంబసర్వే నిర్వహించినా దాని వివరాలు సైతం బయటకు వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news