అయ్యప్ప దీక్షలో ఉన్న వైసీపీ కార్యకర్త కిడ్నాప్ అయ్యాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తని బలవంతంగా తాడేపల్లిలో పోలీసులు కిడ్నాప్ చేశారని వైసీపీ పార్టీ అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. టీడీపీ కూటమి ప్రభుత్వ అసమర్థతని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త నాని (నాగి రెడ్డి)ని మఫ్తీలో వచ్చి ప్రైవేట్ కారులో తీసుకెళ్లినట్లు తెలిపింది వైసీపీ. అయ్యప్ప దీక్షలో ఉన్న నానీని కనీసం పూజ కూడా చేసుకోనివ్వకుండా బలవంతంగా లాక్కెళ్లారు.
ఏ పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నారో చెప్పకుండా ఉదయం నుంచి పోలీసులు నాటకాలు చేస్తున్నారని మండిపడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాల గురించి పట్టించుకోకుండా.. ప్రశ్నిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేయడంలో పోలీసులు బిజీ అయ్యారని ఆగ్రహించింది వైసీపీ. అరెస్టులతో వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తున్నారా అంటూ కూటమి నేతలపై ఫైర్ అయింది.
అయ్యప్ప దీక్షలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తని బలవంతంగా తాడేపల్లిలో పోలీసులు కిడ్నాప్
@JaiTDP కూటమి ప్రభుత్వ అసమర్థతని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త నాని (నాగి రెడ్డి)ని మఫ్తీలో వచ్చి ప్రైవేట్ కారులో తీసుకెళ్లిన @APPOLICE100అయ్యప్ప… pic.twitter.com/n4kkeA8j9C
— YSR Congress Party (@YSRCParty) November 5, 2024