కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వాటి గురించి ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. మంగళవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ఎండగడుతూ వస్తున్నారు.
తాజాగా రియల్ రంగం కుదేలవ్వడంపై ఆయన స్పందిస్తూ.. ‘తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, తొమ్మిదిన్నర ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం రయ్.. రయ్ మని ఉరికిందని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే రియల్ ఎస్టేట్ రంగం నై.. నై అంటోందని” విమర్శించారు. తెలంగాణ ఆదాయానికి జీవధార రియల్ రంగంపై హైడ్రా వేటు వేసిందని.. ముందు చూపు లేని ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు పడిందని కేటీఆర్ మండిపడ్డారు.