BB Jodi: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న భాను శ్రీ..!

-

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి స్టార్ మా ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తుంది. ఈ క్రమంలోని బాగా తెలుగులో ఆదరణ పొందిన బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సెలబ్రిటీలు .. ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. అందుకే ప్రతి సీజన్లో కొంతమంది షో లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఒకే స్టేజి పైకి తీసుకొచ్చి బిగ్ బాస్ జోడి అనే మరో కొత్త డాన్స్ ప్రోగ్రాం ప్రారంభించారు స్టార్ మా నిర్వాహకులు. గత కొన్ని వారాల నుండి రన్ అవుతున్న ఈ షోలో రోజురోజుకు జంటలుగా పాల్గొంటున్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే శని, ఆదివారాలలో ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా కొత్త ప్రోమో విడుదల చేయగా ఇందులో యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా, నటి సదా , సీనియర్ నటి రాధా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ జడ్జిల్లా వ్యవహరిస్తున్నారు . కానీ చివరిగా పర్ఫామెన్స్ లపై వాదించుకొని హర్ట్ అయిపోయారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలోనే మెహబూబ్ – శ్రీ సత్య పెర్ఫార్మన్స్ గురించి అరియానా , భాను శ్రీల మధ్య వార్ జరిగింది. మహబూబ్, శ్రీ సత్య ఇద్దరు డైరెక్టర్ త్రివిక్రమ్ స్పెషల్ అంటూ రోబోటిక్ పర్ఫామెన్స్ చేశారు. దీనిపై రియాక్ట్ అయింది అరియానా .. త్రివిక్రమ్ అని రోబో చేశారు అంది.

భాను శ్రీ అవును రోబోలాగే అనిపించింది అంది. వెంటనే సదా రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్ అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేశారు అని అడగా దీనిపై మెహబూబ్ కూడా కామెంట్ చేశాడు. అంతే ఒక్కసారిగా భాను శ్రీ ఏడ్వడం మొదలు పెట్టేసింది. ఎందుకు ఏడ్చిందో కూడా తెలియదు ఇప్పుడు వీడియో అయితే వైరల్ అవుతుంది కానీ పూర్తిగా తెలియాలి అంటే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version