బీసీ రిజర్వేషన్ల అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించేలా చేస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో కేవలం 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదన్నారు. అందుకే రీ సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని పిలపునిచ్చారు.రీ సర్వేలో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొనాలని సూచించారు.తమిళనాడు తరహా షెడ్యూల్-9 పెట్టాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ప్రధాని మోడీ , తెలంగాణలో బీజేపీ ఎంపీలు సైతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.