తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏ మాత్రం లేదని తెలిపారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే.. అటు తెలంగాణ రాష్ట్ర రైతులు మాత్రం…. యూరియా కోసం లైన్లలో నిల్చున్నారు.
అదే సమయంలో…యూరియా బస్తాల కోసం ఉదయం నుంచి లైన్లో నిలబడి రైతులు తిప్పలు పడుతున్న వీడియోల బయటకు వస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో సొసైటీ గోదాంకు వచ్చిన యూరియా బస్తాలు 200 అయితే 400 మంది రైతులు రావడంతో, యూరియా బస్తాల కోసం కాసేపు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.