షేక్ హ్యాండ్ వివాదంపై కౌంట‌ర్ ఇచ్చిన బీసీసీఐ

-

పాకిస్తాన్ క్రికెటర్లకు భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై మొన్నటి నుంచి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం పైన బీసీసీఐ సీనియర్ అధికారి రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్ధులతో షేక్ హ్యాండ్ కు సంబంధించి రూల్ బుక్ లో ఎలాంటి స్పెసిఫికేషను లేదని చెప్పారు. అది ఒక గుడ్ విల్ జెశ్చర్ మాత్రమేనని అన్నారు. అది ఎలాంటి చట్టం కాదు. అలాంటి రూల్ లేనప్పుడు సత్సంబంధాలు లేని ప్రత్యర్థికి టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

bcci
bcci

ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పలకాలని భారతీయులు పేర్కొంటున్నారు. కాగా మొన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది. టీమిండియా విజయం సాధించిన అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు. దీంతో భారత ఆటగాళ్ల ప్రవర్తనపై పాకిస్తాన్ ఆటగాళ్లు ఫైర్ అయ్యారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా కేవలం 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news