ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆప్స్ మ్యాచ్ ల సమయంలో బీసీసీఐ ఒక స్టేట్ మెంట్ ను నాలుగు జట్లకు ఇచ్చింది. ఈ నాలుగు మ్యాచ్ లలో ఒక్కో డాట్ బాల్ ను బౌలర్ సాధిస్తే, అందుకు ప్రతిఫలంగా బీసీసీఐ 500 మొక్కలను నాటుతుందని మాటిచ్చారు. కాగా ప్లే ఆప్స్ లో మొత్తం 294 డాట్ బాల్స్ నమోదు అయినట్లుగా బీసీసీఐ తెలిపింది. ఆ విధంగా బీసీసీఐ చెప్పిన ప్రకారం ఒక్క డాట్ బాల్ కు మొక్కలు చొప్పున 294 డాట్ బాల్స్ కు147000 మొక్కలను నాటడానికి అంగీకరించింది. చెప్పినట్లుగానే తాజాగా కేరళ, కర్ణాటక, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలలో ఈ మొక్కలను బీసీసీఐ కార్యదర్శి జై షా ఆధ్వర్యంలో నాటింది. బీసీసీఐ చేసిన ఇంతమంచి పనిని గురించి సోషల్ మీడియాలో అందరూ అభినందిస్తున్నారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ వరకు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ ల మధ్యన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది..
చివరి బంతి వరకు గుజరాత్ గెలుస్తుందని అనుకున్నా… ఆఖరి బంతికి ఫోర్ కొట్టిన జడేజా చెన్నై కు మరో టైటిల్ ను అందించాడు.